MJPTBCWREIS 6th, 7th, 8th Class Admission Notification.
మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల 2022- 23 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశం కొరకు సమాచారం.
- మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల,బాలికల పాఠశాలలో 2022-2023 విద్యా సంవత్సరానికి గాను 6,7,8 తరగతులలో (ఇంగ్లీష్ మీడియం) స్టేట్ సిలబస్ లో ఖాళీ సీట్లకు బీసీ,ఎస్సీ ఎస్టీ, మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేదీ 19-06 2020 నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాత జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడును.
- ప్రవేశమునకు అర్హత:
- a) ఆరవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి.
- b) ఏడో తరగతి ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో ఆరో తరగతి చదివి ఉండాలి.
- c) ఎనిమిదో తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 సంవత్సరంలో ఏడవ తరగతి చదివి ఉండాలి.
- d) విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2020-21 మరియు 2021-22 విద్యా సంవత్సరములలో నిరవధికంగా విద్యనభ్యసించి ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థుల తల్లిదండ్రుల/సంరక్షకులు సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూ.1,50,000/-పట్టణ ప్రాంత విద్యార్థులకు రూ.2,00,000/- కు మించరాదు.
- విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది.
- జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పాత జిల్లాలోని ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉండాలి.
ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష తెలుగు, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లో 5,6,7 వ తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో 100 మార్కులకు (తెలుగు-15, లెక్కలు-30, సామాన్య శాస్త్రం-15, సాంఘిక శాస్త్రం-15, ఇంగ్లీష్-25 మార్కులతో) ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
- జవాబులను ఓఎంఆర్ షీట్ లో గుర్తించాలి.
- విద్యార్థుల కోసం నమూనా ప్రశ్నాపత్రం మరియు నమూనా ఓఎంఆర్ పత్రంలో పట్టిక-1లో ఇవ్వబడినది.
- పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.
- పరీక్ష కేంద్రం: విద్యార్థిని విద్యార్థులకు వారి సొంత జిల్లాల్లో మాత్రం పరీక్ష నిర్వహించబడును. పరీక్ష కేంద్రాల వివరాలు హాల్ టికెట్ లో ఇవ్వబడును.
- పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి (అనాధ) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.
ప్రారశాల కేటగిరి | A | B | C | D | E | ఎస్సీ | ఎస్టీ | ఈబీసీ/ ఇతరులు | అనాధలు | మొత్తం |
బిసి గురుకుల పాఠశాల | ||||||||||
- ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినప్పుడు పుట్టిన తేది, గణితంలో మరియు పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
- ఏదేని రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు.
- ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన (అనాథ) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను తదుపరి రిజర్వేషన్ అభ్యర్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు.
- జిల్లాల వారీగా, పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు పట్టిక-2లో ఇవ్వబడినవి.
- ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధి కారం ఉంది. mjptbcwreis.telangana.gov.in సంస్థ వెబ్సైట్లో తేది 10-06-2022 నాటికి నెంబర్ల ప్రవేశానికి ఎంపికై విద్యార్థుల ఉంచబడతాయి.
- ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే సంక్షిప్త సందేశాలు ఫోన్ ద్వారా పంపబడును.
- అడ్మిషన్ ప్రక్రియ 31-08-2022 తో ముగియబడును. ఈ తేది తదుపరి ఎట్టి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించబడవు.
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని (PAYMENT GATEWAY) తెలంగాణ ఆన్లైన్క ప్రాథమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి/సంరక్షకుని మొబైల్ నెం) వెళ్లి రూ. 100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. జర్నల్ నెంబరు పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకొన్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబరు మాత్రమే.
- ఆ జర్నల్ నెంబరు ఆధారంగా ఏదేని ONLINE (ఆన్లైన్)/ఏదేని ఇంటర్నెట్ సెంటరు నుండి సంస్థ వెబ్సైట్ mjptbcwreis.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం (కాలమ్లో నమోదు చేయవలెను.
గడువు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను తేది 16-04-2022 నుండి తేది 02-06-2022 వరకు చేసుకోవచ్చును. ఆన్లైన్లో దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబరు ఇవ్వబడును. నింపిన
- దరఖాస్తు నమూనా కాపీనీ ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి. • దరఖాస్తును ఇంటర్నెట్ ద్వారా నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించి, ఒక పాస్పోర్టు సైజు ఫోటోను స్కాన్ చేసి, అప్లోడ్ చేయవలెను.
- దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేట గిరి ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ మొదలగు ధృవపత్రాలు (ఒరి జినల్) పొంది యుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని యెడల అట్టి వారు పైన తెలి పిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొందియుండాలి. ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి. లేని యెడల విద్యార్థి ఎంపిక కాబడిననూ ప్రవేశం కల్పించ బడదు.
వయసు:
6వ తరగతికి: 31/08/2022 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
7వ తరగతికి: 31/08/2022 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
8వ తరగతికి: 31/08/2022 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీలకు 2 సంవత్సరాల మినహాయింపు కలదు.
MJPTBCWREIS 6th, 7th, 8th Class Admission Notification: Click Here