NTRUHS PG Admission Notification 2022 Dates

NTRUHS PG Admission Notification 2022 Dates:విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ (ఎన్టీఆర్ యూహెచ్ఎస్)-పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది.2020-21, 2021-22 అకాడమిక్ సంవత్సరాలకు సంబంధించి ఉమ్మడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫుల్ టైం, పార్ట్ టైం విధానాల్లో ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ఫుల్ టైం ప్రోగ్రాం వ్యవధి మూడేళ్లు. దీనిని గరిష్ఠంగా ఐదేళ్లలో పూర్తి చేయాలి. పార్ట్ టైం ప్రోగ్రాం వ్యవధి నాలుగేళ్లు. దీన్ని గరిష్టంగా ఆరేళ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీహెచ్ డీ

విభాగాలు: మోడరన్ మెడిసిన్ (ప్రీ క్లినికల్, పారా క్లినికల్, క్లినికల్ సబ్జెక్ట్స్). డెంటల్ సైన్సెస్:, ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధ, హోమియోపతి)’, ఫిజియోథెరపీ, నర్సింగ్, నేచురోపతి, ఇతర ఆలైడ్ హెల్త్ సైన్సెస్.

అర్హత: ఎంసీఐ/ డీసీఐ/ సీసీఐఎం/ ఐఎన్సీ/ సీసీహెచ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి సంబంధిత స్పెషలైజే షన్ ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ ఎస్/ ఎండీ (ఆయుష్ కోర్సులు)/ ఎమ్మెస్సీ(నర్సింగ్)/ ఎంపీటీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎమ్మెస్సీ(మెడికల్ అనాటమీ/ మెడికల్ ఫిజి యాలజీ/ మెడికల్ సోషియాలజీ/ మెడికల్ మైక్రోబయాలజీ/ మెడికల్ బయో కెమిస్ట్రీ/ మెడికల్ ఫార్మకాలజీ/ మెడికల్ ఫిజిక్స్/ క్లినికల్ ఎంబ్రియాలజీ/ మెడికల్ సైకాలజీ/ న్యూరోసై న్సెస్/ మెడికల్ జెనెటిక్స్/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ బోటనీ/ మైక్రోబయాలజీ/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ), ఎంఏఎస్ఎల్పీ (ఆడియా లజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ)/ బీటెక్ పాటు రెండేళ్ల ఎమ్మెస్సీ (బేసిక్ సైన్సెస్/ ఎపిడిమియాలజీ అండ్ బయో స్టాటి స్టిక్స్): ఎంఫార్మసీ ఉత్తీర్ణులు కూడా అర్హులే. పార్ట్ టైం ప్రోగ్రా మ్లో చేరాలంటే ఎన్టీఆర్ఎయూహెచ్ఎస్ గుర్తింపు పొందిన కళాశాలల్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉండాలి. అభ్యర్థుల వయసు గరిష్టంగా 65 ఏళ్లు మించకూడదు.

ముఖ్య సమాచారం……

దరఖాస్తు ఫీజు: రూ.5,900
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: జూన్ 25
చిరునామా: కన్వీనర్, PhD అడ్మిషన్స్ 2020-21 &2021-22, సిల్వర్ జూబ్లీ బ్లాక్ మొదటి అంతస్తు, అడ్మిషన్స్ వింగ్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.

వెబ్ సైట్: ntruhs.ap.nic.in