APRJCCET 2022 Notification Apply at aprs.apcfss.in

APRJCCET 2022 Notification Apply at aprs.apcfss.in. ఏ.పీ.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-2022.

APRJC-2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 07 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మరియు 03 రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో ప్రవేశం కొరకు, 10వ తరగతి ఏప్రిల్/మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థినీ, విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్ (https://apra.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. ప్రవేశముల కొరకు date:05-06-2022 నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష రెసిడెన్షియల్ మైనార్టీ జూనియర్ కళాశాల నందు ప్రవేశం కొరకు క్రింది మైనారిటీ విద్యార్థుల ప్రవేశ పరీక్ష వ్రాయవలసి అవసరంలేదు మరియు వారి ప్రవేశమునకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబడును.

APRDC CET-2022

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల (పురుషులు), నాగార్జునసాగర్, విజయపురి సౌత్, గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశం కొరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మే 2022 పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల నుండి ఆన్లైన్ (https://apra.apcfss.in) ద్వారా దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశంలకు కొరకు తేదీ:05-06-2022
నాడు ఆంధ్రప్రదేశ్ లోని 13 పాత జిల్లా కేంద్రాల్లో మాత్రమే ప్రవేశ పరీక్ష జరుగును.
RJC&DC-CET-2022 కొరకు తేదీ: 28-04-2022 నుండి 20-05-2022 వరకు ఆన్లైన్ (https://aprs.apcfss.in) ద్వారా దరఖాస్తు రుసుము రూ.250.00 చెల్లించి దరఖాస్తు సమర్పించవలెను. ఇతర మార్గదర్శకాలు మరియు నియమ నిబంధనలు కొరకు https://aprs.apcfss.in ను సందర్శించగలరు లేదా కార్యాలయం పనివేళల్లో 91003 32106,96764 04618 మరియు 70933 23250 ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.